సమంత ‘యూటర్న్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది కన్నడరంగంలో భారీ విజయం అందుకున్న ‘యూ టర్న్’ చిత్రంపై తెలుగు, తమిళ, రంగాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచనతో పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో నటి సమంత సైతం ఈ చిత్రంపై ఆసక్తి ప్రదర్శిస్తోందట. ‘యూ టర్న్’లో చేయాలని అనుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆమే నిర్మాతగా తెలుగులో ఆ చిత్రాన్ని రీమేక్ చేయనున్నదనీ వార్తలొస్తున్నాయి. ఆ సినిమా సమంతకు బాగా నచ్చడంతో ‘అన్నీ కుదిరితే నేనే ఆ చిత్రంలో నటిస్తా’ అని అంటున్నట్టు సమాచారం. ఇదంతా నిన్నటి మాట. బాగా ఆలోచించిన తరువాత ఆ సినిమాలో నటించకుండా ‘యూ టర్న్’ తీసుకుందట. రీమేక్ చేయడంవల్ల కథలోవున్న గాఢత, రమ్యత తగ్గిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టూ వినిపిస్తోంది. అయితే సమంత బదులుగా మరో నాయిక నటిస్తుందా? లేదా శ్రద్ధా శ్రీనాధ్ నటించిన కన్నడ చిత్రాన్ని అనువాదం చేస్తారా? అనేది మాత్రం ఇతమిత్థంగా ఇంతవరకూ తేలలేదు.