సాహో.. పరిణీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో అంతర్జాతీయ స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఈ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం సాహో. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం రేపింది. బాహుబలి ఇంపాక్ట్‌తో సాహో చిత్రానికి భారీ బిజినెస్ ఆఫర్ దక్కిందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తూనే ఉంది. ఇప్పటికే తమన్నా, దీపికా పదుకొనె, కత్రినాల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిణీతి చోప్రా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఆమెతో చర్చలు జరిపారని, ముఖ్యంగా ఈ సినిమాతో సౌత్‌లో నటించేందుకు పరిణీతి ఆసక్తి చూపినట్టు సమాచారం. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రెండు మూడు చిత్రాలు చేసిన ఈమెకు సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అప్పటినుంచి అవకాశాల కోశం ఎదురుచూస్తున్న పరిణీతికి నిజంగా ఇది లక్కీ ఛాన్స్.