రొమాంటిక్ క్రైం బిట్రగుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలే ఫిలింస్ పతాకంపై జెవి నాయుడు ప్రధాన పాత్రగా చేస్తున్న చిత్రం ‘బిట్రగుంట (ది బిగినింగ్)’. నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. మురళీధర్‌రెడ్డి, ఇషిక జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజు మాట్లాడుతూ క్రైం రిలేటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న చిత్రంలో దారి దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ సాగే కథనంతో చిత్రం ఉంటుందన్నారు. రౌడీలకు, పోలీసులకు మధ్య జరిగే ఛేజింగ్‌లు ఉత్కంఠభరితంగా చూపిస్తున్నామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రియలిస్టిక్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, నెల్లూరు జిల్లాలోనే షూటింగ్ జరిపామని నిర్మాత జెవి నాయుడు అన్నారు.