మేడమీద అల్లరి అబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి ప్రజిత్ దర్శకత్వంలో గొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఒరు వడక్కమ్ సెల్ఫీ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ తరువాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ జరుపుతున్నాం. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తి చేశాం. మిగిలివున్న పాటల్ని పూర్తి చేసి జూన్ చివరివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నాం. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలెట్. నరేశ్ కామెడీ కథలో కొత్తదనం చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక సమాధానం’ అన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మా జయంతి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు చంద్రశేఖర్, కెమెరా ఉన్ని ఎస్ కుమార్, సంగీతం షాన్ రెహమాన్, ఎడిటింగ్ నందమూరి హరి, నిర్మాత బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జి ప్రజిత్.