ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్ తెండూల్కర్ -పేరు వింటేనే కోట్లాది భారతీయులకు ఓ పూనకం. బ్యాట్ పట్టుకుని మైదానంలో ఉన్నంతసేపూ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం. అతని పోస్టర్ కనిపించినా దాచి పెట్టుకోవాలన్నంత మైకం. అలాంటి సచిన్నోడు -తెరపై కనిపిస్తే? ఓహ్.. అభిమానులకు, అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాళ్లకు.. అంతెందుకు ప్రతి భారతీయుడికీ ఎక్కడలేని ఆనందమే. బయోపిక్‌ల మీద బయోపిక్‌లు సంధిస్తున్న బాలీవుడ్ -‘సచిన్’ జీవితాన్నీ మే 26న సంధిస్తోంది. ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న కోట్లాదిమందిని ఊరిస్తూ సచిన్ బయోపిక్ ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. యువతరం భారతీయులకు సచినో ఐకాన్ కనుక -ఒక్కొక్కటిగా రాష్ట్రాలూ అతని బయోపిక్‌కు వినోదపు పన్ను మినహాయింపు ప్రకటిస్తున్నాయి. ‘సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్’ చిత్రానికి కేరళ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించాయి. చిత్రమేమిటంటే -ఆయా భాషల్లో సినిమా రూపుదిద్దుకోకున్నా, భారత్‌కే ప్రతిష్ఠాత్మకమైన వ్యక్తి జీవిత కథనం కనుక అతని గౌరవార్థం రెండు రాష్ట్రాలూ వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చేశాయి. నిజానికి సచిన్ బయోపిక్ -హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయి. కానీ, విజయం సాధించిన వారి జీవితాల్లోని ఒడుదుడుకులను ప్రత్యేకంగా తీసుకుంటాం. పడిన కెరటం ఎలా లేచిందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మూడేళ్లకే బ్యాట్ పట్టుకుని క్రికెట్ పట్ల మమకారాన్ని ప్రదర్శించిన సచిన్ టెండూల్కర్, ఆ క్రీడలో ఏ స్థాయికి ఎదిగాడు? అతని కలలు, సాధించిన విజయాలు, జీవితంలోని ముఖ్య ఘట్టాలు ముచ్చట్లు, బాధాకరమైన అంశాలు.. మొత్తంగా ‘సచిన్’ జీవితమే తెరకెక్కింది. నవతరానికి ఆదర్శప్రాయమైన అతని జీవితాన్ని తెరపై అందరూ చూడాలి. స్ఫూర్తిమంతమైన అతని జీవితం నుంచి ఎంతో గ్రహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఆ కాంక్షతోనే ‘సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్’ రూపొందించాం’ అంటున్నాడు నిర్మాత రవి భాగ్‌చంద్క్. బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ జేమ్స్ ఎర్స్‌కైన్ దర్శకత్వంలో తెరకెక్కిన సచిన్ జీవితానికి అర్థవంతమైన, ఆర్థ్రతతో కూడిన సంగీతాన్ని అందిస్తున్నాడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి జీవితాన్ని చిత్రంగా మలిచేందుకు జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్న వ్యక్తులు పని చేస్తుండటం ఇక్కడ విశేషం. ‘సచిన్’ బయోపిక్ పట్ల ఇప్పటికే బాలీవుడ్‌లో అంచనాలు పెరుగుతుండటంతో -నా జీవితాన్ని తెరపై చూసుకోబోతున్నా. ఆశీర్వదించండి’ అంటూ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని సచిన్ తెండూల్కర్ కలిశాడు. భార్య అంజలి సహా మోదీని కలిసిన సచిన్ ఆ విషయాన్ని ట్వీట్ చేస్తూ ‘తెరకెక్కిన నా జీవితం గురించి ఎన్నో విషయాలు మొదీతో పంచుకున్నా. ఆయన నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. కోట్లాది భారతీయుల ఆశీర్వాదం సచిన్‌కు ఎప్పుడో దొరికింది. అతని బయోపిక్ ‘సచిన్ -ద బిలియన్ డ్రీమ్స్’కు లభించడమే తరువాయి.