ఇదో కొత్త ప్రయత్నం -‘అంధగాడు’ రాజ్‌తరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తోన్న చిత్రం ‘అంధగాడు’. హైదరాబాద్‌లో శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ అంధుడిగా వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంలో హీరో రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడాడు.
కథ వింటున్నపుడే కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకూ చేసిన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు కాస్త భిన్నంగా చేస్తోన్న ప్రయత్నమిది. కథను వెలిగొండ శ్రీనివాస్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక సినిమాకు మరో ఎస్సెట్ శేఖర్ చంద్ర సంగీతం. ఆయన అందించిన రీ రికార్డింగ్ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. ఒక మంచి కథతో వస్తున్న సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నాడు.
దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘కథను రాజ్‌కు చెప్పినపుడు చాలా బాగా నచ్చింది. వెంటనే మనం సినిమా చేద్దామన్నాడు. ముఖ్యంగా సినిమాకు నువ్వే దర్శకత్వం వహించమని అడిగాడు. నాకు కూడా ఎప్పటినుంచో దర్శకత్వం చేయాలన్న కోరిక ఉంది. అది ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన రాజ్‌తరుణ్, అనిల్ సుంకరలకు కృతజ్ఞతలు. మంచి కథతో సినిమా ఉంటుంది. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ రాజ్‌తరుణ్ కెరీర్‌లో ఇది మరో మంచి చిత్రం. కమర్షియల్ సినిమాలనే కాకుండా భిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు రాజ్. సినిమా దాదాపు పూరె్తైంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జూన్ 2న విడుదల చేస్తామన్నారు.