స్క్రిప్ట్ నచ్చితేనే... -అనీషా ఆంబ్రోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన ‘లేడీస్ టైలర్’ ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజేంద్రప్రసాద్ హీరోగా రాజోలు పరిసరాల్లో కొబ్బరిచెట్ల మధ్య నడిపించిన పల్లెటూరి కొంటె కథ అప్పట్లో కమర్షియల్‌గానూ సెనే్సషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వంశీ. ‘సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే ఉపశీర్షికతో సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి, మానస ముఖ్యపాత్రల్లో మధుర శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చెప్పిన విశేషాలు.
వంశీ దర్శకత్వంలో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. నా పాత్ర అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి పాత్ర. అయితే ఈ అమ్మాయికి పల్లెటూరివాళ్లు ఎలా ఉంటారో తెలీదు. తనకు చీర కట్టుకోవడం కూడా రాదు. గ్లామరస్ రోల్స్ చేయడం నాకు ఇష్టమేకానీ మామూలుగా కాలేజీకి వెళ్లే అమ్మాయిగా మోడరన్ డ్రెస్‌లో కనిపించడం కామన్. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం మామూలు విషయం కాదు. సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా నా పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నది గ్రహించాను. వంశీ సినిమాలో అవకాశం రావడం లక్కీగా ఫీలవుతున్నా. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నా. వచ్చిన వాటిలో బెస్ట్ అవకాశాలను ఎంచుకుంటూ సినిమాలను ఒప్పుకుంటున్నాను. అన్ని రకాల పాత్రలు చేస్తా. అప్పట్లో పవన్‌కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ, ఈలోగా ఆ అవకాశం నాకన్నా బెటర్ అని కాజల్‌కు వెళ్లింది. ఇందులో నేను పెద్దగా ఫీల్ అయ్యింది ఏమీ లేదు. ఆ పాత్రకు ఎవరు బెటర్ అనిపిస్తే వారికే అవకాశం వస్తుంది. ఒక్కడు మిగిలాడుతోపాటు మరో సినిమా చర్చల్లో ఉంది. ఏదేమైనా నాకు స్క్రిప్ట్ బాగా నచ్చాలి. అది నచ్చితేనే సినిమాకు ఓకె చెబుతా అంటోంది.