గరుడవేగ వర్సెస్ జార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వరరాజు రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం.’. పూజాకుమార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బలమైన విలన్ జార్జ్ పాత్రలో ప్రముఖ నటుడు కిశోర్ నటిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో ఇమిడిపోయే కిశోర్ ఈ చిత్రంలో నటిస్తున్న పాత్ర తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ఈ పాత్ర ఓ రకంగా చెప్పాలంటే రక్షసుడు మానవ రూపంలో ఉన్నట్లుగా ఉంటుందని, అతని ఆలోచన, కపటం, ఒళ్లు విషం, అతనితో పొత్తే వినాశనం, శారరీకంగా అవిటివాడు అయినా మానసికంగా చాలా బలవంతుడు. అతని బుద్ధితో ఢీకొట్టి గెలవడం చాలా అసాధ్యమని, అతనితో బేరానికి దిగలేరని, భయపెట్టి బతకలేరని అన్నారు. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడని, జాలీ, దయ, ప్రేమ, కరుణ లాంటి పదాలు అతని డిక్షనరీలో లేవని, భారతీయ చలనచిత్రంలో ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్‌సింగ్ పాత్రలను ఈ పాత్ర తలపిస్తుందని తెలిపారు. అరుణ్ అతిథి, కిశోర్, రవివర్మ, చరణ్‌దీప్, నాజర్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:అంజి, సంగీతం:శ్రీచరణ్, నిర్మాత:కోటేశ్వరరాజు, దర్శకత్వం:ప్రవీణ్ సత్తారు.