ఒక్క సిక్స్ పడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి. లాస్ట్ ఓవర్.. లాస్ట్ బాల్. సిక్స్ కొట్టాల్సిన అనివార్య పరిస్థితి. టెయిలెండర్ బలంగా కొట్టిన బంతి -బౌన్స్‌లేకుండా బౌండరీ దాటేస్తే..? క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఎదురయ్యే ఇలాంటి ఉత్కంఠ పరిస్థితినే -కెరీర్‌పరంగా కొందరు హీరోలూ ఎదుర్కొంటున్నారు. వాళ్లకు ఇప్పుడొక సిక్స్ పడాలి. కాదు, హిట్టు కొట్టాల్సిన అనివార్య పరిస్థితి. లేదంటే -కెరీర్ డైలమాలో పడటం ఖాయం. ‘సూపర్ సిక్స్’లు పడకున్నా హీరోగా రాణించేందుకు వైవిధ్యమైన పాత్రలతో వ్యూహాత్మకంగా సినిమాలు చేస్తున్న కొందరు హీరోల కెరీర్ సాఫీగానే నడుస్తోంది. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన ప్రయోగాలు చేస్తూ చిన్నదో పెద్దదో విజయాలు అందుకుంటున్నారు. కమర్షియల్ ఫార్మాట్‌ని, ఫార్ములాని వదిలిపెట్టని కొందరు హీరోలు మాత్రం ఒక్క సిక్సూ లేక ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా స్టార్ ఇమేజ్ గ్రాఫ్ తగ్గుతుండటంతో -వాళ్లలో టెన్షన్ మొదలైంది. కెరీర్ ఇంకొన్నాళ్లు ముందుకు సాగాలంటే ‘సిక్సర్’ కొట్టక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
మాస్ మహారాజ్ ఫాలోయింగ్‌తో రవితేజ సక్సెస్ రేటు తక్కువేం కాదు. స్ట్రాంగ్ ‘కిక్’తో ‘బలుపు’ ప్రదర్శించి తన ‘పవర్’ ఏమిటో చూపించినవాడు రవితేజ. రెండో ‘కిక్’నిస్తే రేంజ్ పెంచే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ‘జీరో’ సైజ్ ప్రయోగం వికటించటంతో ప్రేక్షకులకే కాదు, అభిమానులకూ దూరంకావాల్సి వచ్చింది. ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’లా గర్జించినా ఓకే అన్నారు తప్ప ఓన్ చేసుకోలేకపోయారు. కెరీర్‌కు ‘హిట్టు’ అనివార్యమైన రవితేజ, పాతరూపం కోసం కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా రవితేజ రిటర్న్స్ అంటూ రెండు ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ‘టచ్ చేసి చూడు’ అంటూనే, ‘రాజా ది గ్రేట్’ అనిపించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. రెండు ప్రాజెక్టులతో సిక్స్‌లు అందుకుంటే తప్ప, రేసులో రవితేజ నిలబడటం కష్టమన్న పరిస్థితి కనిపిస్తోంది. సో, రవితేజకు ఇప్పుడో సిక్సర్ పడాలి.
***
‘అఖిల్’ సినిమాతో నాగ్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరోకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అంచనాలకు మించిన భారీతనంతో వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అఖిల్’ అభిమానులను సంతృప్తిపర్చలేకపోయాడు. చాక్లెట్‌బోయ్ చేసిన హీరో’యాక్షన్ జనానికి నచ్చలేదు. ఆ స్ట్రోక్ నుంచి అఖిల్ ఇంకా కోలుకోలేదా? అన్నట్టు ఏడాదిన్నర అయినా రెండో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ముందూ వెనుకా ఆలోచించాల్సి వస్తోంది. తాజాగా ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. క్రికెట్‌లో రాణించే అఖిల్, స్క్రీన్‌పై సిక్సర్ కొడితే తప్ప తోటి హీరో ఆటగాళ్లను ఫేస్ చేయడం కష్టం.
***
యాక్షన్ స్టార్ ఇమేజ్ మసకబారుతుండటంతో, గోపీచంద్‌లోనూ టెన్షన్ మొదలైంది. సరైన హిట్టుపడితే తప్ప కెరీర్ గాడిన పడే అవకాశం లేదు. ఇంతకుముందు ‘లౌక్యం’గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న గోపీచంద్, ‘జిల్’తో యూత్‌కు కితకితలు పెట్టాడు. ఆ సినిమా తరువాత రెండేళ్లవుతున్నా, ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. మూడేళ్ల క్రితం మొదలెట్టిన ‘ఆరడుగుల బుల్లెట్’ అదిగో ఇదిగో అంటూ కాలయాపనలోనే ఉండిపోయింది. సీనియర్ దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంతోపాటు మరో చిత్రాన్నీ ప్రారంభించాడు గోపీచంద్. ఇప్పుడు ఇతనికీ ఓ ‘సిక్సర్’పడాలి.
**
కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ స్థానాన్ని భర్తీ చేశాడని గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ను వరస పరాజయాలు వెంటాడుతున్నాయి. కామెడీగా కెరీర్ కాలం గడిపేసే సమయంలో ‘బందిపోటు’ ప్రయోగం చేసి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. తరువాత చేసిన రెండు మూడు ప్రాజెక్టులూ నిరుత్సాహానే్న మిగల్చటంతో, మళ్లీ నాగేశ్వరరెడ్డితో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ ప్రాజెక్టు చేశాడు. హారర్ కామెడీ భయపెట్టి కితకితలు పెట్టకపోగా భారీ పరాజయం మిగిల్చింది. ప్రస్తుతం అల్లరి నరేష్ కొత్తగా చేస్తున్న సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.
**
కమెడియన్‌గా సూపర్ సిక్సర్లు కొట్టిన సునీల్, హీరోగా ప్రమోషన్ పొంది కెరీర్ పరుగులో వెనుకపడ్డాడు. రాజవౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’, ఆ తరువాత ‘పూలరంగడు’ సినిమాలు తప్పిస్తే, కమర్షియల్ హీరోగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కొంత గ్యాప్ తరువాత చేసిన జక్కన్న, కృష్ణాష్టమి కూడా ఫెయిల్యూర్స్‌గా మిగలటంతో, ఒక్క ‘హిట్ట’యినా కావాలంటూ ఎదురు చూస్తున్నాడు. కొత్త ప్రాజెక్టుతో సక్సెస్ అందుకోలేకపోతే, కెరీర్ ప్రమాదంలో పడినట్టే.
***
మంచు మనోజ్ చేసిన సినిమాలకు, సక్సెస్ కొట్టిన సినిమాల సంఖ్యకూ పొంతనే ఉండదు. గత ఏడాది శౌర్య, అటాక్, ఈ ఏడాది గుంటూరోడు చిత్రాలతో చేసిన ప్రయత్నాలూ కలిసిరాలేదు. ఆడియన్స్ నుంచి ‘ఓకే’ అని కూడా అనిపించుకోలేకపోవడంతో, ఎల్‌టిటిఇ ప్రభాకరన్ జీవిత కథతో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. అటు ప్రయోగాలు చేసే అవకాశం రాక, ఇటు కమర్షియల్ హిట్టు అందుకోలేక సతమతమవుతోన్న హీరోల జాబితా చిన్నదేం కాదు. ఆ లిస్టులో యువ హీరోలు ఆది, నారా రోహిత్, నాగశౌర్యలాంటి వారెందరో. వీళ్లందరికీ ఇప్పుడొక హిట్టుపడాలి. సిక్స్ కొట్టాలి. అదొక్కటే మార్గం.

-శ్రీ