అల్లుడు శీను అలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో మేఘనా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్-6 చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వినాయక్ క్లాప్ ఇవ్వగా రాఘవ లారెన్స్ కెమెరా స్విచాన్ చేసారు. మరో దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ డిక్టేటర్ తర్వత నేను తెరకెక్కిస్తున్న ఆరవ చిత్రం ఇది. డిఫరెంట్ జోనర్లో తెరకెక్కే చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తగా కనిపిస్తాడు. అన్ని రకాల హై టెక్నికల్ అంశాలతో తెరకెక్కే చిత్రాన్ని హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఆ తర్వాత మేజర్ షెడ్యూల్‌ను ఫారిన్‌లో చిత్రీకరిస్తాం. ఇంకా హీరోయిన్ ఎంపిక కాలేదు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపించనున్న చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా ఆర్థర్ విన్సన్, మాటలు సాయిమాధవ్ బుర్రా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన దర్శకత్వం శ్రీవాస్.