అబుదాబిలో మహాభారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏకంగా 1500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి దుమ్ము రేపింది. ఈ సినిమాకు దీటుగా ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త బి.ఆర్.శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడన్న వార్తలు వచ్చాయ. వచ్చే ఏడాది చిత్రాన్ని మొదలుపెడతామని, మహాభారతాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ చిత్రంలో మళయాళ నటుడు మోహన్‌లాల్ భీముడిగా కనిపిస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, నటీనటులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. శ్రీకుమార్ మీనమ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం అబుదాబిలో ప్రారంభం కానుందట.