యోధతో వస్తారట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్ల షూటింగ్ జరుపుకుంటున్న సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దసరాకు విడుదల చేయాలనే ప్రణాళికతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ నటించే తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్‌గా మణిరత్నం రూపొందించిన చెలియ ఫ్లాప్ అవ్వడంతో చరణ్ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిగా లేడన్న ప్రచారం జరిగింది. కానీ మణిరత్నంతో సినిమా తీయడానికి చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా చివరి దశకు వచ్చిందన్న కథనం తాజాగా వినిపిస్తోంది. సుకుమార్ సినిమా పూర్తి కాగానే మణిరత్నం చిత్రం సెట్స్‌పైకి రావొచ్చని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి యోధ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి.