అలా.. పల్లవిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమమ్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆ ఒక్క సినిమాతోనే దక్షిణాది పరిశ్రమలో మంచి అవకాశాలే దక్కుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వరుణ్‌తేజ్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘్ఫదా’ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవికి, నేచురల్ స్టార్ నానితో జతకట్టే అవకాశం వచ్చిందని అంటున్నారు. నానితో కొత్త సినిమాకి దాదాపు సైన్ చేసినట్టేనన్నది ఇండస్ట్రీ టాక్. తెలుగులో మరో యంగ్ హీరో సరసన సైతం హీరోయిన్‌గా సాయికి చాన్స్ దక్కింది. రోబో చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ యువ హీరో నాగశౌర్యతో తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. జూన్ లేదా జూలైలో మొదలుకానున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తారట. ఈ చిత్రంలోనూ నాగశౌర్యతో సాయిపల్లవి జత కట్టనుంది.