నాకిది పెద్ద హిట్టే: నిఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్‌హిట్ చిత్రాలతో మెప్పించిన యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేశవ’. మే 19న విడుదలై విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ ‘సినిమా పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నా. నేను ఊహించినదానికంటే పెద్ద హిట్ చేశారు. మూడు రోజుల్లో 11.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. నా సినిమాల్లో ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా కేశవ నిలిచింది. నేను వైవిధ్యమైన కథలతో చేస్తున్న సినిమాలను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రేక్షకులకూ కృతజ్ఞతలు తెలిపింది. సుకుమార్ మాట్లాడుతూ సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అని నిర్మాతను చూస్తే తెలుస్తుంది. నిర్మాత అభిషేక్ నామా ఎంతో సంతోషంగా ఉన్నారు. సుధీర్ వర్మ ముందుగా కథను నాకే చెప్పారు. డిఫరెంట్‌గా ఉందని చెప్పాను. హ్యాపీడేస్‌లో నిఖిల్‌కు, కేశవలో నిఖిల్‌కు చాలా తేడా కనబడుతోంది. ఏ కథలోనైనా ఒదిగిపోతున్నాడు. సింగిల్ ఎమోషన్‌ను చక్కగా పలికించాడు. డైలాగ్స్ తక్కువగా ఉన్నా, అందరూ మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. సుధీర్‌వర్మ సినిమాను బాగా తెరకెక్కించాడు అని ప్రశంసించారు. దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘అనుకున్నది అనుకున్నట్టే సినిమా చేశాను. నిఖిల్ కథ చెప్పగానే ఒప్పుకున్నాడు.