బాండ్ అంబాసిడర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేమ్స్‌బాండ్ సినిమాల ప్రస్తావన వస్తే ఠక్కున గుర్తొచ్చే నటుడు రోజర్ మూర్. అపరాధ పరిశోధన చేసి శత్రువులను తుదముట్టించే ఘనడు ఎలా ఉంటాడంటే మూర్ గుర్తుకొస్తాడు. అంతలా ప్రపంచాన్ని సమ్మోహన పరచిన రోజర్ మూర్ బ్రిటిష్ నటుడు. పద్దెనిమిదేళ్ల వయసులో మోడల్‌గా, బుల్లితెరపై వచ్చే ప్రకటనల్లో నటుడిగా అడుగులేశాడు. తరువాత టీవీ సీరియల్స్‌లో ప్రజల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా ‘ది సెయింట్’ ధారావాహిక అతడికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టింది. తరువాత ఎన్నో సీరియల్స్‌కు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించిన మూర్ కొన్నింటిలో బాండ్ పాత్రలూ ధరించాడు. అప్పటికే జేమ్స్‌బాండ్ పాత్ర పోషిస్తున్నవారిని కాదని రోజర్ మూర్‌కు అవకాశం వచ్చినా, సీరియల్స్‌లో బిజీగా ఉండి నటించే అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. చివరకు తొలిసారిగా 1973లో ‘లివ్ అడ్ లెట్ డై’లో జేమ్స్‌బాండ్ పాత్రలో నటించాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో వరుసగా ఏడు బాండ్ చిత్రాల్లో అతడు నటించి మెప్పించాడు. అతడు నటించిన సినిమాల్లో ‘ది మేన్ విత్ ది గోల్డెన్ గన్’ (1974), ‘ది స్పై హు లవ్‌డ్ మి’ (1977), ‘మూన్‌రాకర్’ (1979), ‘్ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’ (1981), ‘ఆక్టోపుస్సి’ (1983), ‘ఎ వ్యూ టు ఎ కిల్’ (1985) సంచలనం సృష్టించాయి. జేమ్స్‌బాండ్ పాత్రలో ఎక్కువసార్లు నటించిన, ఆ పాత్రలు చేసిన వారిలో పెద్ద వయస్కుడు రోజర్ మూర్. అకాడమీ అవార్డుల పోల్‌లో ఉత్తమ బాండ్ నటుడిగా 62శాతం ఓట్లతో రికార్డు సృష్టించిన మూర్, 1987లో హామీ యానివర్సిరీ ఆఫ్ బాండ్ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించాడు. బాండ్ పాత్రధారి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించాడు. 45వ ఏట తొలి జేమ్స్‌బాండ్ పాత్ర ధరించిన మూర్, 58వ ఏట చివరి బాండ్ చిత్రంలో నటించి రిటైర్మెంట్ ప్రకటించాడు. జేమ్స్‌బాండ్‌గా అవకాశం కోసం హెయిర్‌కట్ చేసుకోవడం, బరువు తగ్గేందుకు వ్యాయామం చేయడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. కేవలం జేమ్స్‌బాండ్ చిత్రాల్లోనేకాక మరో 13 ఇతర సినిమాల్లోనూ ఆయన మెచ్చదగ్గ నటన ప్రదర్శించాడు. ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్రవేసి, మంగళవారం తుది శ్వాస విడిచిన మూర్‌ను సినీ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు.