ఎదురుచూపే అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు వంశీ చిత్రమంటేనే ఓ వైవిధ్యం. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రాలన్నింటికీ దాదాపుగా ఇళయరాజానే సంగీత దర్శకుడు. తరువాత చక్రి వైవిధ్యమైన బాణీలు అందించాడు. తాజాగా వంశీ దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీ్ధర్ రెడ్డి రూపొందిస్తున్న ‘్ఫ్యషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సందర్భంగా మణిశర్మ చెప్పిన విశేషాలు.
సంగీతంలో ఫ్యాషన్
సహజంగా కాలాన్నిబట్టి సంగీతంలో మార్పులొస్తాయి. ఏ పీరియడ్‌కు ఆ ఫ్యాషన్ ఉంటుంది. ఇప్పటివరకూ దాదాపు 90మంది దర్శకులతో పనిచేశా. కానీ వంశీతో పనిచేయలేదు. ఈ ప్రాజెక్టు ఎప్పటినుంచో నాకొక డ్రీమ్. అది ఇప్పటికి నెరవేరింది.
గురువే ప్రేరణగా..
నా గురువు ఇళయరాజా. ఆయన లేడీస్ టైలర్ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘్ఫ్యషన్ డిజైనర్’కు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా. నేను పెద్ద మాటకారిని కాదు. మా గురువు పేరు నిలబెట్టేలా ఈ సినిమాకు కృషి చేశాను.
అలా కుదరలేదు..
వంశీతో కలిసి పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఎందుకో అలా కుదరలేదు. సినీ పరిశ్రమలో ఏదైనా ఓ అద్భుతం లాంటిది. దానికోసం మనం ఎదురుచూడాలే కానీ ఎందుకు? అని అనుకోవద్దు. ఇన్ని రోజులు ఆ అద్భుతం జరగలేదు, ఇప్పుడు జరిగిందంతే.
ఎవరి పాటలు వారికి..
ఇనే్నళ్ల తరువాత వంశీ నేను కలిసి పని చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. మా మీటింగే బాగా జరిగింది. ఆయన టేస్ట్ ఎలాంటిదో, ఆయన పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే త్వరగా నా పనిని పూర్తి చేయగలిగా. ఎవరికితగ్గట్టు వారికి పాటలు ఇవ్వడంలో నేను బెస్ట్ అని నా అభిప్రాయం.
సొంతంగానే..
ఇళయరాజా అందించిన సినిమాకు సీక్వెల్‌లో సాంగ్స్ అందించడానికి ఆ ట్యూన్స్ ఉపయోగించలేదు, ప్రేరణ కూడా పొందలేదు. చాలా ఫ్రీ మైండ్‌తో నా బాణీలు నేను చేసుకున్నా. ఎప్పుడైనా ఒక ట్యూన్ చేసేటప్పుడు మనసంతా దానిమీద పెడితే ది బెస్ట్ ఔట్‌పుట్ వస్తుంది. అందుకే నా పాటలు ఎప్పుడూ ప్రెష్‌గా ఉంటాయి.
అన్నీ మెలోడీలే...
సినిమాలో మొత్తం పాటలన్నీ మెలోడి బీట్‌తోనే ఉంటాయి. ఈ ఆల్బంను ఛాలెంజ్‌గా తీసుకుని తీర్చిదిద్దా. అయితే ఒక్కో పాట ఓక్కో ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నా. ఈ చిత్రంలో ‘కనులేమిటో..’ అనే పాట కోసం కుస్తీలు పడి మరీ చేశా. చివరిలో ఈ పాట విన్నాక శ్రమంతా మర్చిపోయా. ఇప్పటి ట్రెండ్‌కు సరిపోయే రిథమ్ ఉంటుంది.
వౌన సంభాషణ..
వంశీ మితభాషి. నేనూ అంతే. మా ఇద్దరి మధ్య సంభాషణ వౌన సంభాషణే. సినిమా అంటేనే ప్రొడక్ట్ బాగా రావాలని ఎవరైనా ఏంచెప్పినా వినాలి. అలాంటప్పుడు దర్శకుడే చెబితే అదే ఫైనల్. అలా సాగింది.
అప్పుడూ ఇప్పుడూ..
అప్పుడు సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం బాగుంటేనే అది మ్యూజికల్ హిట్. ఇప్పుడు మాత్రం సినిమా హిట్టై, పాటలు బాగలేకున్నా మ్యూజికల్ హిట్టే.

-యు