అబ్బాయిలు పాయిజనెస్! -రకుల్‌ప్రీత్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రకుల్‌ప్రీత్ ధైర్యంగానే ఖండించింది. రకుల్‌ప్రీత్‌సింగ్ మరోసారి అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చింది. ఎవరైనా తన దగ్గరకొచ్చి ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అని అంటే, తాను కూడా ‘అబ్బాయిలు పాయిజనెస్’ అని అంటానంటోంది. నాగచైతన్య, రకుల్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంలో చిత్ర విశేషాలకు రకుల్ ఇలా చెప్పుకొచ్చింది.
మీ పాత్ర..
భ్రమరాంబ పేరుతో ఓ పాత్ర చేస్తున్నా. నిజంగానే ఇదొక వైవిధ్యమైన, బలమైన పాత్ర. అలాగని సీరియస్‌గా కాకుండా లవబుల్‌గా ఉంటుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంత ప్రాధాన్యత వుందో అలా వుంటుంది. ఇలాంటి పాత్రకు నేను న్యాయం చేయగలనని నమ్మిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నేనే భ్రమరాంబలా మారానో లేక భ్రమరాంబే నన్ను ఆవహించిందో తెలీదుకానీ ఈ పాత్రలో చేసేటప్పుడు చాలా ఆనందించా.
కాస్ట్యూమ్స్ విషయంలో...
గ్రామీణ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర కనుక పల్లెపడుచులు వేసే బ్రైట్ కలర్స్ డిజైన్ చేశారు. ఆ పాత్ర ఎంత క్యాచీగా జనాలకు రిజిస్టర్ అవుతుందో నా డ్రెస్సింగ్ కూడా అంతే ట్రెండింగ్ అవుతుంది.
హైద్రాబాదీనే...
నేను ఉత్తరాది అమ్మాయినని మర్చిపోయా. సినిమా కెరీర్ టాలీవుడ్‌లోనే ప్రారంభమైంది కనుక హైదరాబాదీ అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటా. తెలుగు నేర్చుకుంటా. చెన్నైలో తమిళ సినిమా చేసేటప్పుడు నాకు తెలుగు ట్రాన్స్‌లేటర్‌ను ఇచ్చారు. తమిళంలో డైలాగులను తెలుగులో చెబుతుంటే నేను తమిళంలో చెప్పాను. తెలుగు భాషే నాకు ఓ ఐడెంటిటీ ఇచ్చింది.
దర్శకుడే కారణం...
నాకు చైతన్యకు మధ్య మంచి కెమిస్ట్రీ పండడానికి కారణం దర్శకుడే. ఆయన మా పాత్రలను అందంగా డిజైన్ చేస్తేనే అలా పండించగలిగాం. ఇన్నోసెంట్ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో చక్కగా డీల్ చేశాడు దర్శకుడు.
చైతూతో..
అతనితో నాకు ముందునుంచే పరిచయం ఉండటంవల్ల సినిమా చేసేటప్పుడు వర్క్ చేసినట్టే ఉండేది కాదు. చాలా ఫ్రీగా మూవ్ అయ్యాం. చైతూ చాలా మంచి అబ్బాయి.
నిర్మాత నాగ్ గురించి..
సినిమా కోసం నాగార్జున చాలా కేర్ తీసుకున్నారు. చాలా కంఫర్ట్‌గా ఉంచారు. సినిమా చివరి రోజు ఆయన నాకు ఫోన్ చేశారు. తాను సినిమా చూశానని, భ్రమరాంబ పాత్ర బాగా వచ్చిందని మెచ్చుకున్నారు.
ప్రొడక్షన్ గురించి?
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కనుక ప్రొడక్షన్ చేయడంపై ఆసక్తి ఉంది. కానీ దానికింకా సమయం ఉంది. ప్రస్తుతం నటనపైనే ఆసక్తి. నిర్మాతగా మారితే హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయి. కనుక ఇప్పుడు ఆలోచించడంలేదు.

-శ్రీ