ఫీల్‌గుడ్ గువ్వ గోరింక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాగణంగా ఆకార్ మూవీస్ పతాకంపై మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దామురెడ్డి కొనసం, దళం జీవన్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘గువ్వ గోరింక’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఓ అందమైన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. విభిన్నమైన మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ప్రేమకథను దర్శకుడు సరికొత్తగా తెరకెక్కించారని, కొత్త తరహా కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి, పాటలు కందికొండ, కృష్ణకాంత్, సురేందర్, మాటలు బంజారా, కెమెరా మైల్స్ రంగస్వామి, ఎడిటింగ్ గారీ బి హెచ్, దర్శకత్వం మోహన్ బొమ్మిడి.