రజని కబాలి వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్‌గా వెండి తెరపై తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రజనీకాంత్ లేటెస్ట్‌గా నటిస్తున్న సినిమా కబాలి. ‘్భషా’ తర్వాత మళ్లీ అండర్‌వరల్డ్ నేపథ్యంలో అంత శక్తివంతమైన చిత్రంలో తలైవా నటిస్తున్నారనే వార్తలు చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కబాలి’. పా.రంజిత్ దర్శక్వం వహిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కలైపులి.యస్.్థను భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 20నుంచీ మలేషియాలో చివరి షెడ్యూల్ జరుగుతుంది. రజనీతోపాటు ప్రధాన తారాగణం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 28తో చిత్రీకరణ పూర్తవుతుంది. మే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘నా జీవితాంతం గుర్తుండే చిత్రమిది. రజనీకాంత్ గారితో చిత్రం చేయడమనేది నా చిరకాల కోరిక. చైనా సూపర్ స్టార్ విల్సన్ చౌ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. రాధికా ఆప్టే, థన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మురళీ, పోరాటాలు: అనబ్‌రివు, మాటలు: సాహితి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవి శ్రీదేవి సతీష్, సంగీతం: సంతోష్ నారాయణ్.