సత్యా గ్యాంగ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రథ్యూస్, సాత్విక్, హర్షితా పన్వార్, అక్షిత ప్రధాన తారాగణంగా సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో మహేష్ ఖన్నా రూపొందిస్తున్న చిత్రం ‘సత్యాగ్యాంగ్’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- సందేశాత్మక కథనంతో వినోదాన్ని జోడించి ఈ సినిమాను దర్శకుడు వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నాడని, ప్రాణాపాయ పరిస్థితిలో వున్న తమ స్నేహితుడికోసం అతని మిగతా స్నేహితులు ఏం చేశారు అనే కథనంతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. పాటలు మినహా షూటింగ్ పూర్తిచేశామని, బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. సత్యా గ్యాంగ్ చిత్రం నేటి ట్రెండ్‌కు అనుగుణంగా వుంటుందని, యువతకు తమ కథే చూచినట్లుగా కనిపిస్తుందని, కొత్తవారైన నటీనటులు బాగా నటించారని, జీవా, షఫి, సుమన్ వంటి సీనియర్ ఆర్టిస్టుల నటన సినిమాకు హైలెట్‌గా వుంటుందని దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. కాలకేయ ప్రభాకర్, మహేష్ ఖన్నా తదితరులు నటిస్తున్నారు.