విజయభైరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, కీర్తిసురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై భరతన్ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి అందిస్తున్న చిత్రం ‘విజయభైరవ’. ఈ సినిమాకు సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- తమిళంలో సంచలన విజయం సాధించిన ఇళయ దళపతి విజయ్ నటించిన ‘్భరవ’ చిత్రాన్ని తెలుగులో విజయ భైరవ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఓరియెంటెడ్‌గా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు నటన హైలెట్‌గా వుంటుందని తెలిపారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో సతీష్, వై.జి.మహేంద్ర, తంబి రామయ్య, డేనియల్ బాలాజీ, అపర్ణా వినోద్, పాప్రిఘోష్, హరీశ్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సంతోష్ నారాయణన్, కెమెరా:ఎం.సుకుమార్, పాటలు:వెనె్నలకంటి, నిర్మాత:బెల్లం రామకృష్ణారెడ్డి, కథ, దర్శకత్వం:్భరతన్.