అమ్మాయిలే బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలతో నటించడంకన్నా అమ్మాయిలతో నటిస్తేనే హాయిగా వుంటుంది అని చెబుతోంది అందాల భామ ఇలియానా. బాలీవుడ్‌లో కెరీర్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు అప్పుడప్పడు తన వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘ముబాకరన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సునీల్‌శెట్టి తనయ అతియాశెట్టి కూడా నటిస్తోంది. ఈ సందర్భంగా తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని, గతంలో కూడా మై తేరా హీరో చిత్రంలో నర్గిస్ ఫక్రితో కలిసి నటించానని, తాను ఎవరితోనైనా ఇలాగే కలిసిపోగలనని చెబుతోంది. కాకపోతే బిజీ షెడ్యూల్స్‌తో రోజూ కలుసుకోలేకపోయినా ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో నిరంతరం టచ్‌లోనే ఉంటామని చెబుతోంది. ఏదేమైనా అబ్బాయిలతో నటనకన్నా అమ్మాయిలతో కలిసి నటిస్తే అదొక ఆనందమంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఎందుకంటుందో ఏమో?