25కోట్లతో గరుడవేగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వరరాజు రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 125.18’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటేశ్వరరాజు మాట్లాడుతూ పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రల్లో మెప్పించిన రాజశేఖర్, ఈ చిత్రంలో నటిస్తున్న పాత్రతో కొత్త అధ్యాయం సృష్టిస్తాడన్నారు. ఇండియన్ యాక్షన్ చిత్రాలకు ధీటుగా హాలీవుడ్ నిర్మాణ విలువలతో పోటీపడేలా చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 60 శాతం షూటింగ్ పూరె్తైందన్నారు. రష్యన్ స్టంట్ మాస్టర్ డేవిడ్ ఖబు, థాయిలాండ్ స్టంట్ మాస్టర్ మాన్‌నుంగ్, మాస్టర్ సతీష్ నేతృత్వంలో జార్జియా, బ్యాంకాక్, మలేసియా, పట్టాయా, సింగపూర్, ముంబైవంటి ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలు, ఛేజ్ సీక్వెన్స్ చిత్రీకరించామని వివరించారు. ముంబయిలో వేసిన భారీ సెట్‌లో సన్నీలియోన్‌తో చేసిన ఐటెం సాంగ్ సినిమాకు హెలెట్‌గా ఉంటుందని, ఈ షెడ్యూల్‌లో మిగిలిన టాకీ, యాక్షన్ పార్ట్‌ను హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేస్తామని వివరించారు. పూజాకుమార్ కథానాయికగా నటిస్తున్న చిత్రంలో అతిథి, శ్రద్ధాదాస్, కిశోర్, నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృధ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శతృ, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్‌దీప్, రవిరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, నిర్మాణం జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్, కెమెరా అంజి, సంగీతం భీమ్స్, నిర్మాత ఎం కోటేశ్వరరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రవీణ్ సత్తారు.