ఇక ఆ వేడుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైతూ పెళ్లికి ముందుకూడా ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ప్రేమకథల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న చైతూ -ఆ ట్రాక్‌నుంచి కాస్త పక్కకు జరిగి కమర్షియల్ హీరోగానూ టాలెంట్ చూపించడానికి చేసిన మరో ప్రయత్నం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. సినిమాకు ఊహించినంత స్థాయిలో టాక్ రాకున్నా -తరువాతి ప్రాజెక్టుల్లో సైతం వైవిధ్యమైన పాత్రలనే ఎంపిక చేసుకోవడానికి చైతూ ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది.
సాయి కొర్రపాటి బేనర్‌లో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ చందు మొండేటి లైన్ చెప్పాడు. నచ్చింది. ఒక నెలలో ఆ సినిమా డీటైల్స్ తెలుస్తాంయి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం అంటూ ముగించారు. అటు శామ్స్‌తో కలిసి మ్యారేజ్‌కు ముందునాటి మూడ్స్‌లో మునిగితేలుతూనే -పెళ్లికి ముందే మరో ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకు వస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అక్టోబర్‌లో సమంతను మనవాడబోతున్న చైతూ -హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇండియాలోనే పెళ్లి జరపడానికి కుటుంబీకులంతా ఆసక్తి చూపుతున్నారు కనుక -ఆ వేడుకను ఇక్కడే జరుపుకుంటామనీ చెప్పేశాడు. కొత్త దర్శకుడు కృష్ణతో ప్రస్తుతం చేస్తున్న ‘థ్రిల్లర్’ జోనర్ ప్రాజెక్టు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉండటంతో, అక్టోబర్‌లోగా చిత్రాన్ని స్క్రీన్స్‌కు తెవొచ్చన్న అంచనాలు ఉన్నాయి. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చైతూ వైవిధ్యమైన పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నడుస్తుండగానే -దర్శకుడు చందుమొండేటి చెప్పిన కథకూ చైతూ క్లియరెన్స్ ఇచ్చాడనీ ఇండస్ట్రీ టాక్. అంటే, అక్టోబర్‌లో పెళ్లి వేడుకల తరువాత చందు మొండేటి చిత్రాన్ని ట్రాక్ ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. ఈలోగా కార్తికేయ-2 చిత్రాన్ని చందు మొండేటి పూర్తి చేస్తే -తరువాతి ప్రాజెక్టుకు ఇద్దరికీ టైం సెట్‌కావొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక ప్రేమ కథకూ మొగ్గుచూపుతున్నట్టు చైతనే్య చెబుతున్నాడు. ఇక శుక్రవారం విడుదలైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో ఫుల్ ప్లెడ్జెడ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌తో చైతూ ఆకట్టుకున్నాడనే అంటున్నారు. యంగ్ హీరోలంతా ప్లాన్ చేసుకుంటున్నట్టే చైతూ కూడా ఒక ఫెస్టివల్ మూడ్ చిత్రంలో కనిపించి ఒకే అనిపించుకున్నట్టే.