పక్కా విలేజ్ గాళ్‌ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘్ఫ్యషన్ డిజైనర్- సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమంత్ అశ్విన్, మనాలీ రాధోడ్, మానస, అనీషా ఆంబ్రోస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 2న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ మానస చెప్పిన విశేషాలు...
డిసిప్లిన్
వంశీగారి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన కథ రాసుకున్నపుడు ఆ పాత్రలకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్లనే ఎంచుకుంటారు. ముఖ్యంగా నటన రాబట్టే విషయంలో ఆయన ఎక్స్‌పర్ట్. ఆయనతో పనిచేయడంవల్ల నటిగా మరింత ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను. దాంతోపాటు డిసిప్లిన్ అలవాటయ్యింది. ఉదయం ఆరుగంటలకు షాట్ అంటే అందరూ అక్కడ ఉండాల్సిందే. లేదంటే ఆయనకు కోపం వచ్చేస్తుంది.
గేదెల రాణిగా..
ఈ చిత్రంలో గేదెల రాణి పాత్రలో కనిపిస్తాను. పక్కా విలేజ్ గర్ల్. గోదావరి యాస, మాస్ అంశాలతో ఉంటుంది. ముఖ్యంగా పాపికొండల్లో చిత్రీకరణ జరిగింది. వారం రోజులపాటు ఫోన్ కాంటాక్ట్స్ లేకుండా అక్కడే ఉన్నాం. షూటింగ్ బాగా ఎంజాయ్ చేశాం. ముఖ్యంగా సుమంత్ అశ్విన్, మిగతా ఇద్దరూ హీరోయిన్లతో పనిచేయడం ఆనందంగా ఉంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాను. ఈ సినిమా విడుదల తరువాతే మిగతా ప్రాజెక్ట్స్.