వెక్కిరింత మేళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని (శ్రీ్ధర్), వినీత్, ప్రేయసి నాయక్, వౌనికారెడ్డి ప్రధాన తారాగణంగా శ్రీ కోటశెట్టి క్రియేషన్స్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి రూపొందిస్తున్న చిత్రం ‘వెక్కిరింత’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగమణి మాట్లాడుతూ రెండు జంటల మధ్య ప్రేమకథల్లో అసలుసిసలైన సరిగమలేమిటో ఈ సినిమాలో చూడాలని, చిన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆ కోవలోనే ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు, రెండు ప్రేమకథలతో ఈ సినిమాలో పలు ట్విస్టులు ఉంటాయని, సినిమాలో సంగీతం హైలెట్‌గా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పాటలు మనాశ్రీ, ఎస్‌కె షాహి, ఎడిటింగ్ నాగార్జున ఎం, సంగీతం చంద్రలేఖ, కెమెరావాసిరెడ్డి సత్యానంద్, మాటలు సాయి రామకృష్ణ, నిర్మాత కాకర్ల నాగమణి, కథ, దర్శకత్వం జంగాల నాగబాబు.