9న ఆరడుగుల బుల్లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జూన్ 9న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత రమేష్ మాట్లాడుతూ- ఈ చిత్రానికి సహకరించిన నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు. సినిమా బాగా వచ్చింది. గోపీచంద్ కెరీర్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది అన్నారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ- గోపీచంద్‌కు టైటిల్ సరిపోయిందని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను మాస్ సినిమాలే చేస్తానని అంటారు కానీ, నా సినిమాల్లో కామెడీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అన్ని అంశాలున్నాయి. వక్కంతం వంశీ మంచి కథ అందించాడు. దానికి అబ్బూరి రవి చక్కటి మాటలు రాశాడు. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పివిపి అందించిన సహకారం మరువలేనిది అన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ- గోపాల్ దర్శకత్వంలో ఎప్పటినుంచో సినిమా చేయాలన్నది నా కోరిక. నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో ఓసారి అనుకున్నాను కానీ కుదరలేదు. ఆ తరువాత ఆయన నాకీ కథ చెప్పారు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కథ ఇలాంటిదైతేనే బాగుంటుందని అనుకున్నాను. ఇక నయనతార మంచి పాత్ర పోషించింది. సినిమా కొంచెం ఆలస్యమైనా కూడా ప్రేక్షకుల్ని నిరుత్సాహపర్చదు. జూన్ 9న వస్తున్నామన్నారు.