ఏంటిది బిపాసా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్ భామ బిపాసా. ఎప్పుడూ ఖుషీగా ఉండే బిపాసా, గత ఏడాది కరణ్‌సింగ్ గ్రోవర్‌ని పెళ్లాడిన తరువాత మరింత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటోందని సన్నిహితుల మాట. ‘వాళ్లిద్దరూ ఎంత హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆమె ట్వీట్ చేస్తున్న ఫొటోలను చూస్తే చాలు’ అన్నది బిపాసా స్నేహితులు చెప్తోన్న మాట. కరణ్‌తో కలిసి బిపాసా జోరుగా షికార్లు చేస్తోందట. ఇప్పటికే బిపాసా తన ఆనందాన్ని, కరణ్‌తో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది. ఈమధ్యే కరణ్ తన భార్య బిపాసా బికినీ పిక్స్ సోషల్ మీడిలో పోస్ట్ చేసి ‘చూడండి, నా వైఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో’ అంటూ కామెంట్ పెట్టాడు. లేటెస్టుగా బిపాసా సైతం ఓ స్పెషల్ ఫొటోని పోస్ట్ చేసి ‘ఐ లవ్ కరణ్’ అంటూ హాట్ కామెంట్ పెట్టింది.. ఇంతకీ బిప్స్ షేర్ చేసిన ఫొటో ఏమిటో తెలుసా? బిపాసను కరణ్ అమాంతం ఎత్తుకున్నాడు. దాంతో ఆమె అతడిని ముద్దుల్లో ముంచెత్తింది? ఆ ఫొటో చూస్తుంటే వీరిద్దరి మధ్య ఆప్యాయత ఎలాంటిదో తెలుస్తోంది అంటున్నారు స్నేహితులు. గిట్టనివాళ్లు మాత్రం ‘బిపాసకు ఎంతకంత ఓవరాక్షన్. వైఫ్ అండ్ హజ్బెండ్ మధ్య అలాంటి రొమాంటిక్ సీన్స్ మామూలే. వాటిని పదిమందికీ షేర్ చేయాల్సిన పనేముంది?’ అంటూ క్వొశ్చన్ చేస్తున్నారు. ఎదేమైనా పెళ్లి తరువాత బిపాసా సినిమాలకు దూరమై, భర్తతో ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఈ సెలబ్రేషన్స్ తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో కూడా ఉందట బిప్స్.