కాలా మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 3కాలా2. ఆదివారం ఉదయం ముంబాయిలో ప్రారంభమైంది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌కోసం రజనీకాంత్ ఈరోజు ఉదయం చెన్నయ్ నుండి ముంబాయికి చేరుకున్నారు. ముంబాయిలోని దారావి అనే ప్రాంతంలో తమిళులకోసం పోరాడిన కరికాలన్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ హ్యూమాకురేషీ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ అనూస్యమైన స్పందన రావడంతోపాటు సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీ, పా.రంజిత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన కబాలీ బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో రూపొందుతున్న కాలాపై అంతకుమించిన అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు.