హాలీడే ట్రిప్ కోసం రా.. రండోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రారండోయ్ సినిమా విడుదలైన రోజునుండే థియేటర్లవద్ద మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ స్టేజి నుండి చాలా కష్టపడ్డారు. తండ్రి అంటే ఇలా ఉండాలి అనేలా జగపతిబాబు నటించారు. భ్రమరాంబగా రకుల్‌ప్రీత్‌సింగ్ కొత్తదనంతో కనిపించింది. ఈ వేసవికి హాలిడే ట్రిప్‌కోసం థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారని నటుడు నాగార్జున తెలిపారు. నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున రూపొందించిన 3రా రండోయ్ వేడుక చూద్దాం2 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ తన కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చాయని, నాన్న ప్రీప్రొడక్షన్ నుండి షెడ్యూల్స్, పోస్ట్‌ప్రొడక్షన్‌తో సహా మా వెన్నంటే ఉండి సపోర్ట్ ఇచ్చారని, తన పాత్రకు ఇంత గుర్తింపు రావడానికి దర్శకుడి కృషే కారణమని అన్నారు. శివ పాత్రలో నాగచైతన్య వైవిధంగా నటించాడని రెండు మూడు సన్నివేశాల్లో కళ్లనీళ్లు తిరుగుతాయని, దేవిశ్రీప్రసాద్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్‌పాయింట్‌గా మారిందని దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ అన్నారు. కార్యక్రమంలో సత్యానంద్, ఎస్.వి.విశే్వశ్వర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.