మనిషి వర్సెస్ దయ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాప్సీ ప్రధాన పాత్రలో శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిషోర్ నటిస్తున్న చిత్రం 3ఆనందో బ్రహ్మ2. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహి వి.రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ టీజర్ విడుదల చేశారు. ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి అప్లాజ్ వస్తుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. కథానాయిక తాప్సీ మాట్లాడుతూ.. ఇందులో కానె్సప్ట్ మాత్రమే హీరోగా కనిపిస్తుందని, హారర్ చిత్రంగా ఉంటూ కొత్తదనంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ హీరోగా కనిపిస్తాయని, తెలుగులో ఇలాంటి చిత్రం ఇప్పటివరకు రాలేదని తాను చెప్పగలనని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, భయానికి నువ్వంటే భయం అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు మహి తెలిపారు. హారర్ కామెడీలో నా ప్రేమకథాచిత్రమ్ ఓ వెరైటీ సినిమా అని, దానికి సీక్వెల్ చేద్దామని చెప్పినా ధైర్యం చాల్లేదని, అయితే ఈ సినిమా ఆ సినిమాకన్నా బావుంటుందని కథానాయకుడు సుధీర్‌బాబు అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధవౌతోంది.