రాంబాబు.. ఫినిషింగ్ టచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం 3ఉంగరాల రాంబాబు2. ఈ సినిమాకి సంబంధించిన రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత కిరీటి మాట్లాడుతూ.. సునీల్ నుండి ఆశించే వందశాతం కామెడీని ప్రేక్షకులు ఈ చిత్రంలో ఎంజాయ్ చేస్తారని, దర్శకుడు క్రాంతిమాధవ్ హిలేరియస్ సన్నివేశాలతో కథను వైవిధ్యంగా చెప్పారని, ఔట్ ఆఫ్ కామెడీ కాకుండా కథతోనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌రాజ్ పాత్ర హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో పాటలు అందరికీ నచ్చుతాయని, ఆడియో సూపర్ హిట్ అవుతుందని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, అలీ, ఆశిష్ విద్యార్థి, మధునందన్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, సత్యం రాజేష్, నల్ల వేణు, మణిచందన, మిధున తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, రహమాన్, కెమెరా: సర్వేష్ మురారి, మాటలు: చంద్రమోహన్ చింతాడ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్.