ఇప్పట్లో రాముడిలా సీతలా పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, మహీధర్, ఇషిత, లలిత హీరో హీరోయిన్లుగా బేబీ అముక్త సమర్పణలో కె.వెంకటేష్ దర్శకత్వంలో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశ్నాథ్ నిర్మిస్తున్న ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నర్సాపూర్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సీడీని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, దర్శకుడు వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు.
సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మంచి సినిమా తీయాలనే ప్రయత్నం అభినందనీయమన్నారు. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, తన వద్ద పనిచేసిన వెంకటేష్ కచ్చితంగా మంచి సినిమా తీసి ఉంటాడని అన్నారు.
దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ, ‘ఇదొక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్. ఓ మర్డర్ మిస్టరీ వుంటుంది’ అని చెప్పారు. కార్యక్రమంలో గాంధీ, వీరరాజు, రామ్‌జగన్, సత్యారెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చల్లారావు, మహిధర్, ఇషిత పాల్గొన్నారు. ప్రశాంత్, మహీధర్, ఇషిత, లలిత, రామ్‌జగన్, తరణి, బాబు, కిరణ్, వైభవ్, భాస్కర్ నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:సత్య గిడుతూరి, పాటలు:చైతన్య రేపాటి, సంగీతం:రమేష్.బి., కెమెరా: ఎ.జగన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్.కె.