మెగా మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా బ్రదర్స్ కాంబినేషన్ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతోంది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల వైవిధ్యమైన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడా? అని ఎదురు చూస్తూ వచ్చిన టాలీవుడ్, ఇప్పుడు దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. స్టార్ హీరోలైన అన్నదమ్ములతో సినిమా రూపొందించడానికి నిర్మాత సుబ్బిరామిరెడ్డి సిద్ధమయ్యారన్న సంగతి తెలిసిందే. అయితే అటు చిరు, ఇటు పవన్ ఇద్దరూ ప్రస్తుత సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ అయితే, పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లు ఆ రెండు సినిమాలను పూర్తిచేశాక వారిద్దరూ కలిసి నటించబోయే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఇప్పటికే కథంతా సిద్ధమైందని నిర్మాత ప్రకటించేశారు. మెగాబ్రదర్స్ కలిసి నటించనున్న చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. దీంతో ప్రాజెక్టుపై మరికొంత క్రేజ్ పెరిగింది. టాలీవుడ్‌లో భారీస్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.