2న నీలంపాటి అమ్మోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు సుమన్, శ్యామ్, శ్రీకీర్తిక, బేబి వైష్ణవి ముఖ్యపాత్రల్లో కొమర వెంకటేష్ నిర్మాణ సారథ్యంలో నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూన్ 2న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శక నిర్మాత తోట కృష్ణ మాట్లాడుతూ- గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 700 సంవత్సరాల క్రితం జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. గ్రాఫిక్స్ ప్రధానాంశంగా సాగుతున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాము. నీలంపాటి అమ్మోరు గురించి చాలామందికి తెలియదు. ఈ సినిమాతో అందరికీ తెలియజెప్పాలోనే సంకల్పంతో సినిమా తీశాను. జూన్ 2న విడుదల చేస్తామన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ- కృష్ణ గత 25 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, సరైన ఫలితం మాత్రం అందుకోలేకపోతున్నాడు. మంచి భక్తిరస చిత్రంగా నీలంపాటి అమ్మోరు చిత్రాన్ని తెరకెక్కించారు. అమ్మవారి ఆశీస్సులవల్ల ఈ సినిమా మంచి విజయం సాధించి కృష్ణకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆనంద్, సంగీతం:ఘనశ్యామ్, నిర్మాత, దర్శకత్వం:తోట కృష్ణ.