అశ్విన్‌తో లోకి చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్విన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఓ చిత్రాన్ని లోకి ఫిలిమ్స్ సంస్థ బిఎంజె స్టూడియోస్‌తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. వశిష్ట పారుపల్లి దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుధేష్ మాట్లాడుతూ కాస్టింగ్ కాల్ పోస్టర్ ఉగాదికి విడుదలై మంచి స్పందన పొందిందని, అనిష్ కురువిల్ల, శివన్నారాయణ నరిపెద్ది ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. న్యూయార్క్, మియామిలో తదుపరి షూటింగ్ జరగనున్నదని, తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఈ సినిమా ఇస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ, హరి, పాటలు: సర్వ సిహెచ్., నిర్మాత: సుధేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వశిష్ట పారుపల్లి.