మా ఊరి ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజునాధ్, తనిష్క తివారి జంటగా ఎస్.వి.ఎం. దర్శకత్వంలో శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. గ్రామీణ నేపథ్యంలో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంజునాధ్ మాట్లాడుతూ- నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. హీరోగా నాకీ చిత్రం మంచి బ్రేక్‌నిస్తుందన్న నమ్మకం ఉంది. జయసూర్య మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ఐదు పాటలు ఉంటాయి. త్వరలోనే పాటలను విడుదల చేసి జూలై చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జయసూర్య, కెమెరా:కళ్యాణ్ సమీ, ఎడిటింగ్:ఆవుల వెంకటేష్, నిర్మాత:మంజునాధ్, దర్శకత్వం:ఎస్.వి.ఎం.