‘కాలా’లో మమ్ముట్టి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాల’. పా.రంజిత్ డైరెక్ట్‌చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘కబాలి’తర్వాత రజనీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారని టాక్. అయితే ఈ విషయమై చిత్ర టీమ్ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే. గతంలో మమ్ముట్టి, రజనీ ఇద్దరూ కలిసి మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘దళపతి’అనే సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెల్సిందే. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానాపటేకర్ ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.