సోగ్గాడే.. శోభనకృష్ణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీ నాగలక్ష్మి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జింక హరిబాబు దర్శకత్వంలో రాయగిరి ఉమాపతి గౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే శోభన్‌కృష్ణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు సాగర్ సీడీ విడుదల చేసి నటుడు నారాయణరావుకు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు జింకా హరిబాబు మాట్లాడుతూ సినిమా పరిశ్రమ నేపథ్యంలో చిత్రం సాగుతుందని, యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. లోబడ్జెట్‌లో క్వాలిటీతో సినిమా రూపొందించామని, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కార్యక్రమంలో నటుడు నారాయణరావు, సాగర్ చిత్ర విశేషాలు తెలిపారు. వంశి, ఝాన్సీ, నందిని తదితరులు నటించిన చిత్రానికి సంగీతం ఆర్‌సి కుమార్, పాటలు రామ్, దర్శకత్వం జింక హరిబాబు.