లవ్‌లీకి మించి హిట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకురాలు జయ రూపొందించిన ‘వైశాఖం’ చిత్రం లవ్‌లీ చిత్రం కంటే పెద్ద విజయం సాధిస్తుందని, మహిళా దర్శకురాలిగా విజయనిర్మల తరువాత ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెకే చెందుతుందని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా ఆర్‌జె సినిమాస్ పతాకంపై బిఎ రాజు రూపొందించిన చిత్రం ‘వైశాఖం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. వినాయక్ మాట్లాడుతూ హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడం వల్ల చిన్న సినిమా అనిపిస్తుందేమో కానీ, బడ్జెట్‌పరంగా చూస్తే ఇది పెద్ద సినిమా అని కితాబునిచ్చారు. పాటలన్నీ లావిష్‌గా తీశారని ప్రశంసించారు. మ్యూజిక్, కెమెరా పనితనం సినిమాలో హైలెట్‌గా ఉంటాయని, తీసుకెళ్ళే దేవుడికంటే మనల్ని మోసుకెళ్లే మనుషులే ముఖ్యమన్న సాయికుమార్ డైలాగ్‌కు మంచి అప్లాజ్ వస్తుందని, ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఒక చిన్న సినిమా వారం రోజుల్లో 2.5 మిలియన్ వ్యూయర్స్‌ని ఆకట్టుకుందంటే మామూలు విషయం కాదని, సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని దర్శకురాలు జయ బి అన్నారు. లవ్‌లీ సినిమా తమ సంస్థలో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందేనని, అంతకన్నా రెట్టింపు విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని నిర్మాత బిఎ రాజు తెలిపారు. కార్యక్రమంలో కెమెరామెన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, నటుడు పృధ్వీ, హరీశ్ తదితరులు చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు.