పేపర్‌బాయ్ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్‌నంది ప్రస్తుతం గోపీచంద్‌తో గౌతమ్ నందా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరోవైపు నిర్మాతగా సెలెక్టివ్‌గా సినిమాల్ని రూపొందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గాలిపటం సినిమా తరువాత సంపత్ నంది నిర్మిస్తున్న మరో చిత్రం పేపర్ బాయ్. జయశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్, ఐశ్వర్య వాట్కర్ జంటగా సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ హీరో గోపీచంద్ క్లాప్‌నివ్వగా, హీరోయిన్ కాథరిన్ గౌరవ దర్శకత్వం వహించింది. అనంతరం సంపత్‌నంది మాట్లాడుతూ- హిలేరియస్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రమిది. బెంగాల్ టైగర్ సినిమాతోపాటు భిల్లా, మాట్రాన్ వంటి చిత్రాలకు కెమెరా అందించిన సౌందర్‌రాజన్ ఈ సినిమాకు కెమెరా అందించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:్భమ్స్, కెమెరా:సౌందర్‌రాజన్, ఆర్ట్:రాజీవ్ నాయర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:మురళి మామిళ్ల, నిర్మాతలు:సంపత్‌నంది, వెంకట్, నరసింహ, దర్శకత్వం:జయశంకర్.