‘మెరుపులా’ మాయమయ్యారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో తారలుగా వెలుగొందాలని చాలామంది కలలుగంటారు. కానీ అందరి కలలు సాకారం కావు. కొందరేమో ధ్రువతారలుగా వెలిగిపోతే మరికొందరు చీకట్లో మిగిలిపోతారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోయిన్ల కెరీర్‌గ్రాఫ్ చిన్నదే. హీరోలైతే 60-70 వచ్చాక కూడా స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. కానీ హీరోయిన్‌కు అలాంటి చాన్స్ లేదు. గ్లామర్ ఉన్నంతవరకే ఆమె హవా కొనసాగేది. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి అక్క పాత్రలో, తల్లి పాత్రలతో ఫిక్సవ్వడం మనం చూస్తున్నదే. అయితే మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుని, తర్వాత హీరోయిన్‌గా నిలబడలేక వెనుదిరిగిన తారలు చాలామందే. ఇక్కడ టాలెంట్‌తోపాటు అదృష్టం అవసరమే! అలా తెలుగులో ఒక్క సినిమాతో మెరిసి మాయమైన తారల గురించి ఓ లుక్కేద్దాం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 149వ చిత్రం శంకర్‌దాదా జిందాబాద్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది బాలీవుడ్ భామ కరిష్మాకొటక్. మొదటి సినిమాయే మెగాస్టార్ సరసన కావడంతో అమ్మడి ఆనందానికి అంతులేకుండాపోయింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో పాపం తెలుగులో కరిష్మాకు అవకాశాలు దక్కలేదు. దాంతో ఎదురుచూసి చివరికి బాలీవుడ్‌నే నమ్ముకుంది. ఈ కోవలో మరో ముద్దుగుమ్మ నికీషాపటేల్‌కు అచ్చంగా అలాంటి పరిస్థితి ఎదురైంది. పవర్‌స్టార్ సరసన ఛాన్స్‌కొట్టేసిన ఈమెకు ఈ సినిమా ఫ్లాప్‌తో టాలీవుడ్‌లో కష్టాలు ఎదురయ్యాయి. పవన్‌కళ్యాణ్ నటించిన కొమరంపులి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికీషా ఇప్పటికీ సరైన అదృష్టం కోసం ఎదురుచూస్తూనే వుంది. సుకుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఆర్య సినిమాతో అటు అల్లు అర్జున్‌కు, ఇటు అనూరాధ మెహతాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమాతో అనూరాధ క్రేజీ హీరోయిన్‌గా మారింది. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈమెకు సరైన బ్రేక్ దక్కలేదు. మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ సినిమాల్లో హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తాడన్న విషయం ఆయన సినిమాలు చెబుతాయి. సొగసుచూడతరమా, మనోహరం, చూడాలని వుంది, ఒక్కడులాంటి చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో ఆయన రూపొందించిన వరుడు సినిమాలో అవకాశం దక్కించుకుంది భానుశ్రీ మెహ్రా. మొదటి సినిమాతోనే స్టార్ కాంబినేషన్‌లో ఛాన్స్ కొట్టేసిన భానుశ్రీకి మంచి కెరీర్ ఉంటుందని ఆశపడింది. కానీ ఆ సినిమా భారీ పరాజయం పాలవ్వడంతో పాపం భానుశ్రీకి ఒక్క అవకాశమూ దక్కలేదు. అయినా అడపాదడపా ప్రయత్నాలు చేస్తున్నా కూడా రెండు మూడు సినిమాలతో సరిపెట్టుకుంది. పూరి దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాతో హీరోయన్‌గా ఎంట్రీ ఇచ్చింది శియ గౌతమ్. ఆ సినిమాతో స్టార్‌గా నిలదొక్కుకుంటానని ఆశపడ్డ ఈ భామకు తీవ్ర నిరాశే మిగిలింది.
ఇక సుకుమార్ దర్శకత్వంలో రెండో సినిమాగా రామ్‌తో తీసిన జగడంతో ఎంట్రీ ఇచ్చింది ఈషాసహాని. ఆ సినిమాలో తన చిలిపి అల్లరితో బాగానే ఆకట్టుకున్నా కూడా ఈమెకు ఆ చిత్రం విజయాన్ని అందించలేదు. తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కనుమరుగైంది. ఇప్పటికే ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు కనబడతారు. మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా ఆ తర్వాత చిత్రాలతో స్టార్లుగా నిలదొక్కుకున్న హీరోయిన్లు ఉన్నారు. కానీ కొందరికి మాత్రం అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది మరి.

-శ్రీ