ఇంజనీర్ బాబేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఏ టైటిల్ పెడతారనే ఆసక్తి ఎక్కువైంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా తెలుగు పరిశ్రమలో కొత్త టైటిళ్ల పరంపర మొదలైంది. ఇదివరకు స్టార్ హీరోలు తమ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా టైటిల్స్‌పెట్టమని దర్శకులను కోరేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు.
కథకు అనుగుణంగా టైటిల్స్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు బాలకృష్ణ నటిస్తున్న చిత్రానికి పైసావసూల్ టైటిల్ పెట్టి షాక్ ఇచ్చారు. అలాగే రామ్‌చరణ్ నటిస్తున్న సినిమాకు రంగస్థలం-1985 అని పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమాకి కూడా ఈ తరహాలోనే ఇంజనీర్‌బాబు అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో పవన్‌కళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు. త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తారట.