లై సాంగ్ వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్ స్టార్ నితిన్, మేఘా ఆకాశ్ జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం లై (లవ్ ఇంటిలిజెంట్ ఎనిమిటీ). ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఆదివారం అమెరికాలో విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని బాంబార్ట్ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈరోజు బాంబార్ట్ సాంగ్‌ని అమెరికాలో విడుదల చేయడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. మణిశర్మ ఇచ్చిన ఆడియో సినిమాకు హైలెట్ కానుంది. మొదట ఓ సాంగ్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే రీరికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. తాజాగా వంద మంది ఫైటర్స్ పాల్గొనగా ఓ భారీ ఫైట్‌ను గ్రాండ్‌గా చిత్రీకరించడం జరిగింది. అది ఈ సినిమాకు పెద్ద హైలెట్ అవుతుంది. ముఖ్యంగా నితిన్, మేఘాఆకాశ్‌ల జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. మా బ్యానర్‌లో కృష్ణగాడి వీరప్రేమగాథ తరువాత హనూతో చేస్తున్న సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, దర్శకత్వం: హను రాఘవపూడి.