సందీప్ కేరాఫ్ సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ని ప్రముఖ నటుడు సూర్య ఆవిష్కరించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- నా పేరు శివ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశీంద్రన్ దర్శకత్వంలో విభిన్నంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. సూర్య ఈ టైటిల్‌ని విడుదల చేయడం ఆనందంగా వుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది. సందీప్ మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నాడు. మెహరీన్ పాత్ర అందంగా ఉంటుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.యు. కాశీ విశ్వనాధ్, పాటలు:రామజోగయ్య, శ్రీమణి, కెమెరా:జె.లక్ష్మణ్‌కుమార్, సహ నిర్మాత:రాజేష్ దండ, నిర్మాత:చక్రి చిగురుపాటి, దర్శకత్వం:సుశీంద్రన్.