యథార్థ సంఘటనల గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్‌పవన్ ప్రధాన తారాగణంగా శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, ఎం.రామ్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం గల్ఫ్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల రెండోవారంలో విడుదలకు సిద్ధవౌతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఎడారి దేశాలకు వలస వెళ్లిన లక్షలాది మంది జీవన స్థితిగతులను, అక్కడ ఉన్న వారి భావోద్వేగాలతో ఓ అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. దుబాయ్, రసల్‌ఖైమా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలలో షూటింగ్ చేశామని, జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. సరిహద్దులు దాటిన ప్రేమకథ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. దినపత్రికలో రోజూ వచ్చే గల్ఫ్ కష్టాల గురించి వినగానే బాధ కలిగిస్తుందని, ఆ నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందిందని దర్శకుడు ఇదివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తయితే ఇదొక ఎత్తని, ఇందులో మాటలు రాసే అవకాశం రావడం తనకు టర్నింగ్ పాయింట్ అని రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. సంభాషణలు చక్కటి భావోద్వేగాలు, మంచి నటన, కొత్త సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ఆయన అన్నారు. అనిల్‌కళ్యాణ్, సూర్య, నల్లవేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ల భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంకరాభరణం రాజ్యలక్ష్మి, తీర్థ, సన, ఎఫ్‌ఎం బాబాయ్ తదితరులు నటించారు.