కొత్త సినిమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో సతమతమైన రవితేజ కాస్త గ్యాప్ తీసుకుని ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే టచ్ చేసి చూడు చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా వుండగా రవితేజ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. స్వామి రారా సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. సుధీర్‌వర్మ లేటెస్టుగా ‘కేశవ’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదివరకే రవితేజకు కథ చెప్పి ఓకె చేయించాడట. ఇందులో రవితేజ కొత్తగా కన్పిస్తాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.