లండన్ బాబులు.. వీసా కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, కలర్స్ స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి టాకీస్ పతాకంపై మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నిఖిల్, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, సుధీర్ వర్మ, పరశురామ్, అనీల్ రావిపూడి తదితరులు కలిసి టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ- చిన్నికృష్ణ చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఉంటే ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. నాతో వీడు తేడా సినిమా చేసి మంచి విజయాన్ని అందించాడు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. తప్పకుండా మంచి సక్సెస్ అయి చిన్నికృష్ణకు మంచి పేరు తేవాలి అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- చిన్నికృష్ణలో మంచి టాలెంట్ వుంది. ఆయన ఎవరితోనైనా కలిసిపోగలరు. మారుతి దర్శకుడిగా ఉంటూ తన బ్యానర్‌లో మరింతమంది దర్శకులకు ప్రోత్సాహమందించడం ఆనందంగా ఉంది. హీరోగా పరిచయం అవుతున్న రక్షిత్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు. దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ- సినిమాలు లేనపుడు నన్ను పిలిచి ఈ సినిమా చేయమని అవకాశమిచ్చిన మారుతికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమిళంలో సూపర్‌హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. హీరో కొత్తవాడైనా అనుభవం వున్నవాడిలా చేశాడు. తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. స్వాతి మాట్లాడుతూ- మంచి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కొంత గ్యాప్ తరువాత వస్తున్న నాకు మరో బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను అన్నారు. మారుతి మాట్లాడుతూ- కొత్త హీరో అయినా డాన్సులు, ఫైట్లు అంటూ హంగామా లేకుండా మన మధ్యలో వున్న ఓ కుర్రాడికి జరిగిన కథే ఇది. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి జీవితంలో ఏం జరిగింది? అనే ఆసక్తికర సంఘటనలతో తెరకెక్కిస్తున్న సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రక్షిత్‌కు మంచి గుర్తింపు వస్తుంది. నిర్మాతగా కిరణ్ ఎంతో సహకారాన్ని అందించాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.