ఇది నిజమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు మోహన్‌బాబు తనయుడు మనోజ్ హఠాత్తుగా బాంబు పేల్చాడు. తాను ఇక నుండి సినిమాల్లో నటించడంలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ తరువాత మరో చిత్రమే చేస్తున్నానని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అకస్మాత్తుగా మనోజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. బాలనటుడిగా పరిచయమైన మనోజ్ కెరీర్‌లో పోటుగాడు, బిందాస్, ప్రయాణం, వేదం లాంటి మంచి చిత్రాలు ఉన్నాయి. అయితే తాను నటనకు ఎందుకు స్వస్తి చెబుతున్నాడు అనే విషయాన్ని మాత్రం మనోజ్ తెలియజేయలేదు. అయితే, సినిమా హీరోగాకన్నా నిర్మాతగా మారి మంచి చిత్రాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడని వినిపిస్తున్న సమాచారం. అయితే, పోస్ట్ చేసిన మూడు గంటలలోపే మంచు మనోజ్ తాను పెట్టిన పోస్ట్‌ను రద్దుచేయడం విశేషం. ఇంతకూ మనోజ్ నటననుండి విరమించినట్లా? లేక పోస్ట్‌నే విరమించుకున్నాడా? త్వరలో తెలుస్తుంది!