ప్రత్యేక పాటలో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోల సినిమాల్లో ఐటెమ్ పాటలు ఇప్పుడొక ట్రెండ్. అభిమానుల్ని ఉర్రూతలూగించాలంటే తమ చిత్రాల్లో ఓ స్పెషల్ సాంగ్ ఉండాలని అగ్రహీరోలు భావిస్తున్నారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ‘పక్కా లోకల్’ సాంగ్‌లో కాజల్‌తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులేశాడు. ఆ పాట మాస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌కు సరిజోడిగా కాజల్ కూడా స్టెప్పులు ఇరగదీసింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జైలవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ఐటెమ్ పాటని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే రికార్డ్ చేశాడని సమాచారం. ఈ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేసే హీరోయిన్ వేటలో ప్రస్తుత చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో మిల్కీ భామ తమన్నా ఉందట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు టాక్? ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు ఎన్టీఆర్ అభిమానుల్ని బాగా ఆకర్షించాయి. ఈ చిత్రాన్ని హీరో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తుండడం విశేషం.